అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 14
అల్వాల పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా ఆదివారం అల్వాల్ వెంకటేశ్వర కళ్యాణ మండపం నుండి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు సమైక్యత తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై ర్యాలిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపన సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు రాజ్ జితేందర్ నాథ్,సబితా అనిల్ కిషోర్,స్థానిక నాయకులు సురేందర్ రెడ్డి, రాజసింహారెడ్డి, బలవంత రెడ్డి, అనిల్ కిషోర్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం అల్వాల్ ఏవిఎస్ఏ అధ్యక్షుడు సిరిపురం ఆనంద్ బాబు, ప్రధాన కార్యదర్శి గరిపెల్లీ విద్యాసాగర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్ర అంజయ్య, కోశాధికారి దేచు గంగాధర్, ఉప్పల వంశీకృష్ణ, తోట శివప్రసాద్, చొక్కారపు నరేందర్, బాశెట్టి కృష్ణమూర్తి, కే ఎల్ శంకర్ రావు, కందూరి చంద్రశేఖర్, కెప్టెన్ సత్యనారాయణ, వెంకటనారాయణ, ఎన్ వి శ్రీనివాసులు, సత్యనారాయణ రత్నమాల, జయలక్ష్మి, కనకదుర్గ, మమత, అర్చన, స్వాతి, చూడామని, కృష్ణవేణి, రాధిక, మాధవి, రమాదేవి, సంఘ సభ్యులు, కార్యకర్తలు, మహిళలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




