మానసిక వికలాంగులకు దుస్తుల పంపిణీ.
ఫోటో రైటప్: వికలాంగులకు దుస్తులు పంపిణీ చేస్తున్న ఎంపీపీ కుటుంబ సభ్యులు.
బెల్లంపల్లి, ఆగస్టు14, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల ఎంపీపీ సంతోషం రమాదేవి- ప్రతాప్ రెడ్డి ఆదివారం తన కుమారుడు శ్రీవర్దన్ జన్మదినం సందర్భంగా ఆవడం గ్రామానికి చెందిన మానసిక వికలాంగులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కుమారుని ప్రతి పుట్టినరోజు నాడు ఏదో ఒక కార్యక్రమం చేయడం ఆనవాయితీగా మరిందని, ఈ ఏడాది మానసిక వికలాంగులకు దుస్తులు పంపిణీ ఎంతో సంతృప్తినిచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.