ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ నివాళులు
జూలూరుపాడు, ఆగష్టు 14, జనంసాక్షి: మండల పరిధిలోని సాయిరాం తండా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ హలావత్ శోభన్ బాబు తండ్రి గోబ్రియా ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ గోబ్రియా పార్థివదేహాన్ని ఆదివారం సందర్శించి, పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు సంతాప, సానుభూతి తెలిపారు. అదే గ్రామానికి చెందిన భూక్య శంకర్ మాతృమూర్తి కొద్ది రోజుల క్రితం మరణించడంతో, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని వారికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ధారావత్ రోజా, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, ఎంపిపి లావుడియా సోనీ, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, ఎఎంసి డైరెక్టర్ హాలావత్ నరసింహారావు, రాంజీ, వెంగన్నపాలెం ఎంపిటిసి దుద్దుకూరి మధుసూదనరావు, ధారావత్ రాంబాబు, మోదుగు రామకృష్ణ, దేవరకొండ కిరణ్, మిరియాల కిరణ్, మాడుగుల నాగరాజు, మంద నరసింహారావు, మంద దేవేందర్, నారపోగు నరసింహారావు కోటేశ్వరావు, పోతురాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




