ఆర్.వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సేవలు ప్రశంసనీయం… టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబి కృష్ణ యాదవ్…
కూకట్ పల్లి జనంసాక్షి : వరల్డ్ టూరిజం డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ పర్యాటక సంస్థలను గుర్తించి ఈ ఏడాది ఆర్ .వి టూర్స్ అండ్ ట్రావెల్స్ బెస్ట్ టూర్ ఆపరేటర్, ట్రావెల్ ఏజెంట్ గా గుర్తించినందుకు చైర్మన్ రమణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రయాణికులకు ఆర్.వి ట్రావెల్స్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంపీ కృష్ణ యాదవ్ పేర్కొన్నారు.ఇటీవల నగరం నుండి అర్.వి ట్రావెల్స్ ఆధ్వర్యంలో టీజీవో అధ్యక్షులు ఎంబి కృష్ణ యాదవ్ కుటుంబ సమేతంగా చార్ధామ్ యాత్ర పూర్తిచేసి తిరిగి వచ్చిన సందర్భంగా కూకట్ పల్లిలోని ఆర్.వి ట్రావెల్స్ లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా భారతదేశంలోని ఫిక్స్ డిపాజిట్స్ తో రూపొందించిన అర్.వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నూతన బ్రోచర్ ను కృష్ణ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడి ఆర్.వి ట్రావెల్స్ నుండి కుటుంబ సమేతంగా చార్ధామ్ యాత్ర ప్రారంభించి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. ట్రావెల్స్ నిర్వాహకులు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళలో మన హైదరాబాదులో ఏర్పాటుచేసిన భోజన సదుపాయాలన్నీ చార్ధామ్ యాత్రలో అందించడం జరిగిందని తెలియజేశారు.ఆర్.వి నిర్వాహకులు ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోవడం నిజంగా ప్రశంసనీయమని కొనియాడారు.ఈ సందర్భంగా ఈశ్వర్ ట్రావెల్స్ నిర్వాహకులైన రమణను ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.




