ఆల్ ఇండియా యూనివర్సిటీ పోటీలకు చాపల చందు
దాతలు ముందుకొస్తే బాక్సింగ్ క్రీడలో రాణిస్తా
కొడకండ్ల,డిసెంబర్04 (జనంసాక్షి) కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వరంగల్ జేఎన్ఎస్ స్టేడియంలో డిసెంబర్02న జరిగిన బాక్సింగ్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి 54 కేజీల విభాగంలో ఆల్ ఇండియా యూనివర్సిటీ పోటీలకు కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన చాపల చందు ఎన్నికయ్యారు. తనకు మద్దతు తెలుపుతున్న గురువు గోధుమల ఆనంద భాస్కర్ కు, మిత్రులకు, తను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తే మున్ముందు మన కొడకండ్ల కు మంచి పేరు తీసుకొస్తానని,ఈ యొక్క ఆల్ ఇండియా యూనివర్సిటీ పోటీలు త్వరలో హర్యానా లోని రోతక్ లో జరగనున్నాయని దానిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ ప్రాంతానికి, జనగామ జిల్లాకి, కొడకండ్ల మండలానికి పేరు తీసుకొస్తానని తెలియజేశారు. అదేవిధంగా ఆలిండియా యూనివర్సిటీ పోటీలకు ఎంపికైన చాపల చందును కొడకండ్ల గ్రామ సర్పంచ్ పసునూరి మధుసూదన్,కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ పేరం రాము,ఈజిఎస్ డైరెక్టర్ అందె యాకయ్య,మార్కెట్ డైరెక్టర్ అమరేందర్ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు,ప్రజలు, మిత్రులు అభినందనలు తెలియజేశారు.




