Wednesday, 4 November 2026

ఆశా కార్యకర్తలకు యూనిఫామ్ పంపిణీ

టేకులపల్లి, సెప్టెంబర్ 20( జనం సాక్షి ): మండలంలోని ఆశా కార్యకర్తలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్లో ఆశా కార్యకర్తలకు వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ ఆధ్వర్యంలో యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం మంగళవారం స్థానిక సర్పంచ్ మాలో సురేందర్ నాయక్ చేతుల మీదుగా అందజేశారు. మొత్తం 101 మంది ఆశా కార్యకర్తలకు యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలపై, సీజనల్ వ్యాధులపై మిగతా ఆరోగ్య కార్యక్రమాలపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విద్య బోధకురాలు జయలక్ష్మి, పి హెచ్ ఎన్ సత్యవతి, డిపిఎమ్ఓ గన్యా, సూపర్వైజర్లు నాగు బండి వెంకటేశ్వర్లు, వీసం శకుంతల, గుజ్జ విజయ, వైద్య సిబ్బంది ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.