తాలెల్మ,రాయికోడ్, మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హస్పిటల్

మరమ్మత్తులకు,మౌళిక వసతులకు నిధులు మంజూరు
అందోల్ ఎమ్మెల్యే ఛంటి *క్రాంతికిరణ్

 

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్20 అందోల్ నియోజకవర్గంలోని తాలెల్మ, రాయికోడ్, మునిపల్లి PHC ప్రభుత్వ ఆసుపత్రులలో మరమ్మతులు మౌళిక సదుపాయాల నిమిత్తం వైద్య సిబ్బంది మరియు స్థానిక నాయకుల సమాచారం మేరకు వెంటనే స్పందించి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి కృషితో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో నిధులు మంజూరు చేయించిన
అందోల్ ఎమ్మెల్యే ఛంటి క్రాంతికిరణ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో మునుపెన్నడూ లేనివిధంగా ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా వైద్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేయించుకున్న వారికి CMRF రూపంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందనీ వారన్నారు ఈ సందర్భంగా వైద్య సిబ్బంది సీఎం కేసీఆర్ గారికి
మంత్రి హరీష్ రావు గారికి
అందోల్ ఎమ్మెల్యే ఛంటి క్రాంతికిరణ్ కృతజ్ఞతలు తెలిపారు