బాస‌ర స‌ర‌స్వ‌తి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ బ్యూరో, సెప్టెంబ‌ర్ 20:జనంసాక్షి,, సెప్టెంబ‌ర్ 26 వ తేదీ నుండి అక్టోబర్ 5  తేదీ వరకు బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తీ  దేవీ శరన్నవరాత్రుల‌ (దసరా) మహోత్సవాల పోస్టర్ ను మంగళవారం నాడు క్యాంప్ కార్యాల‌యంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  మంత్రిని ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో  బాస‌ర‌ ఆలయ పూజారులు, తదితరులు పాల్గొన్నారు.