-కరోనా విపత్కర సమయంలో ఆశా వర్కర్లు చేసినా సేవలు మరువలేనివి – ఎంపీపీ
అశ్వారావుపేట, ఫిబ్రవరి 24(జనంసాక్షి )
అశ్వారావుపేట మండలం పరిధిలో గుమ్మడవెల్లి గ్రామ పంచాయతీ లోనీ ప్రభుత్వ వైద్యశాల నందు ఆశా వర్కర్లకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఉచిత మొబైల్ ఫోన్ లను గురువారం నాడు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీ రామ మూర్తి ఆశావర్కర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతు మన మండలంలోని గుమ్మడవల్లి పి హెచ్ సి కి 29,అశ్వారావుపేట, వినయకపురం హాస్పిటల్స్ కు 66 మొబైల్ ఫోన్ లను ఆశావర్కర్ల కు అందజేయటం జరుగుతుందని, ఇలా ఇచ్చిన ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ లను ఆశావర్కర్లు తమ పని త్వరగా చేయటానికి పని చేసిన వెంటనే ఆన్లైన్ చేసుకునేందుకు మీ కష్టాన్ని తగ్గించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని కరోనా విపత్కర సమయంలో ఆశా వర్కర్లు చేసినా సేవలు మరువలేనివి అని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు జెడ్పీటీసీ చిన్నం శెట్టి వరలక్ష్మి, సర్పంచులు గంగా భవాని,రాములమ్మ, ఎంపీటీసీలు మారుతి లలిత డాక్టర్ హారిష్,రాంబాబు, సి డి పి ఓ రోజారాని, సూపర్ వైజర్ విజయలక్ష్మి ఏఎన్ఎంలు సూపర్వైజర్లు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆశా వర్కర్లకు సెల్ ఫోన్ పంపిణీ




