ఆశ కార్యకర్తల సేవలు మరువలేనివి

కుల్కచర్లలో ఆశ వర్కర్లకు యూనిఫామ్, చీరలు పంపిణీ
 – ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
, జూలై 15(జనం సాక్షి):
కరోనా నివారణలో ఆశ కార్యకర్తల సేవలు మరువలేనివని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలకు, ప్రజా ప్రతినిధులతో కలిసి యూనిఫామ్, చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బాగా కష్టపడ్డా కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశ కార్యకర్తలకు యూనిఫామ్, చీరలు అందిస్తున్నారని తెలిపారు. ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జెడ్పీటీసీ రాందాస్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ బృంగి హరికృష్ణ, రైతుబంధు మండల అధ్యక్షులు రాజు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ సౌమ్య వెంకట్ రామ్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ నాగరాజ్ యాదవ్, స్థానిక ఎంపీటీసీ ఆనందం, తెరాస నాయకులు మాలే కృష్ణయ్య గౌడ్, జోగు వెంకటయ్య గౌడ్, మండల వైద్యాధికారి మురళీకృష్ణ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చంద్రప్రకాష్, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.