ఆసరా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్ సెప్టెంబర్ 20 (జనం సాక్షి) జహీరాబాద్ పట్టణం లోని చిన్న హైదరాబాద్ , రాంనగర్ లలో మంగళవారం ఆసరా పింఛన్ కార్డులను శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, మొద్దు కాలు ఉన్నవారికి, ఫైలేరియా వ్యాధి ఉన్నవారికి, ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారికి, రూ.2,016 మరియు వికలాంగులకు రూ.3,016 ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే భారతదేశంలోనే అది ఓకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సయ్యద్ మోహిఉద్దిన్, వార్డు అద్యక్షులు పాండు ముదిరాజ్, జాకీర్, నాయకులు గ్గౌస్ పటేల్, ఇజ్రాయేల్ బాబీ, సుక్కు చిన్న, బిక్కు నాయక్, శంసుందర్, మచందర్, శంకరప్ప, సిరాజ్, గణేష్, చంద్రయ్య, అనుషమ్మ, బాబు, మున్సిపల్ కమిషనర్, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.