Tuesday, 3 November 2026

ఆసరా పింఛన్ లపై యువకుల ఆరా

ముప్కాల్ ఫిబ్రవరి 24. (జనం సాక్షి) మండల కేంద్రంలో ని అసరా పింఛన్ లలో నెలకొన్న అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టాలని ముప్కల్ లోని యువకులు గురువారం ఎంపిఓ భరత్ చంద్ర కు వినతిపత్రాన్ని సమర్పించారు.గ్రామంలో చాలా వరకు అనర్హులకు పింఛన్ లు ఉన్నాయని ,అర్హులకు పింఛన్ లు అందటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ విజయ్,యువకులు దొర సంతోష్ గౌడ్,హరిన్ , మ్యాక నవీన్,నరేష్ ,జగన్ తదితరులు పాల్గొన్నారు.