Monday, 2 November 2026

ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని కాసేపటిక్రితం ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా కోనేరు కోనప్పకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కుమ్రంభీం చౌరస్తాలోని కుమ్రంభీం విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. కాసేపట్లో చిల్డ్రన్‌ పార్క్‌లో కొట్నాక్‌ భీంరావ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జిల్లా పోలీస్‌ కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. అక్కడే జిల్లాలోని లబ్ధిదారులకు పోడుపట్టాలు అందజేస్తారు.