బచ్చన్నపేట (జనం సాక్షి) జూన్ 30
నిరుపేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తూ వారి ఆర్థిక స్వాలాంబనే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జనగామ జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు ఇర్రీ రమణారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ ఆఫీసులోజనగామ శాసనసభ్యులు గౌరవనీయులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారి అదేశాలు మేరకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది అన్నారు.బచ్చన్నపేట మండల కేంద్రము లో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరు అయిన CMRF చెక్కులు లబ్ధిదారులు అయిన బచ్చన్నపేట గ్రామానికి చెందిన ఎద్దు వెంకటేశ్వలు 60000 , తంగళ్ళపల్లి లక్ష్మయ్య 22500 , కొండ సిద్దయ్య 5000 , VSR నగర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ 24000 , బండ నాగారం గ్రామానికి చెందిన శివరాత్రి రాజనసయ్య 16000 వేల రూపాయల చెక్కులను బచ్చన్నపేట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొడిగం చంద్రారెడ్డి , బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భావాండ్ల కృష్ణంరాజు . బచ్చన్నపేట గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి , సీనియర్ నాయకులు కళ్ళ రవి , VSR నగర్ సర్పంచ్ కోనేటి స్వామి గార్ల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
*ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గంధమల్ల నరేందర్ , పోచన్నపేట గ్రామ శాఖ అధ్యక్షులు కంసాని మహేందర్ రెడ్డి , పోచన్నపేట Pacs డైరెక్టర్ బాల్ చందర్ , నాయకులు బొడిగం గోవర్ధన్ రెడ్డి , తప్పెట్ల వినోద్ కుమార్ , గుర్రాల అనిల్ రెడ్డి తదితరులు ఉన్నారు
నిరుపేదలకు వరం సీఎం సహాయ నిధి… ఇర్రి రమణారెడ్డి




