Tuesday, 3 November 2026

ఆస్తితగాదాలో కొడుకు దారుణం

రోకలిబండతో మోది కన్నతల్లి హత్య
హైదరాబాద్‌,మే2( జ‌నం సాక్షి): కన్నతల్లిని కొడుకు రోకలి బండితో తలపై మోది దారుణంగా హత్య చేసాడో మూర్ఖుడు. ఆస్తి తగాదాలకు తల్లే కారణమని భావించిన కొడుకు చివరకు త్లలినే హతమార్చాడు. ఈ ఘటన న గరంలో కలకలం రేపింది.  ఈ ఘటన డీకే గూడ సవిూపంలోని దాసారం బస్తీలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఇన్స్‌పెక్టర్‌ వహిరుద్దీన్‌ విూడియా సమావేశంలో వెల్లడించారు. గుంతకల్లుకు చెందిన భాగ్యమ్మ(55) తన ముగ్గురు కొడుకులతో కలిసి దాసారం బస్తీ సవిూపంలోని గుడిసెల్లో నివాసం ఉంటోంది. భాగ్యమ్మ కొడుకుల మధ్య గత కొంత కాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. తల్లి కారణంగానే తనకు ఆస్తి దక్కటం లేదనే ఆవేశంతో మూడో కూమారుడు విజయ్‌ బుధవారం ఉదయం 10గంటల ప్రాంతంలో రోకలిబండితో ఆమె తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.