Monday, 2 November 2026

ఆస్తిపన్ను పెంపును నిరసిస్తూ తెదేపా ధర్నా

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనల్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ నేతృత్వంలో ధర్నాకు దిగారు. ముందుగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఛాంబర్‌ని ముట్టడించారు. పత్రికల్లో ఆస్తిపన్ను పెంపుపై వచ్చిన కథనాలని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే పన్ను పెంపును నిలిపివేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఆస్తిపన్ను నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *