Wednesday, 4 November 2026

ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం తగదు

నిర్మల్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : విధి నిర్వహణలో అలసత్వం వహించే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని ఐటీడీఏ పీఓ హెచ్చరించారు. వైద్యులు అంకితభావంతో విధులు నిర్వహించాలని వందశాతం ప్రసవాలు ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో స్త్రీవైద్యనిపుణులను నియమించామని కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గర్భిణులకు ఇక్కడే వైద్యసేవలు అందించాలన్నారు. ఆదిలాబాద్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేయడం తగదన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో సరైన వైద్యసేవలు అందించే బాధ్యత ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులపై ఉందన్నారు. నవజాత శిశు సంక్షేమ కేంద్రం, పౌష్టికాహార పునారావస కేంద్రానికి వస్తున్న పిల్లలు, గర్భవతులు, బాలింతలకు వైద్యసేవలతోపాటు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో మందులు లేవని, సరైన వైద్యసేవలు అందడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. కావల్సిన మందులను కొనుగోలుచేసి వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.