వేసవి తరగతులు నిర్వహిస్తున్న నస్పూర్ మండలంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ పై చర్యలు తీసుకోని క్రిమినల్ కేసులు నమోదు చేసి గుర్తింపు రద్దు చేయాలి.నస్పూర్ మండలంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేసవి తరగతులు నిర్వహిస్తున్నారు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు తొమ్మిద వ తరగతి పూర్తైన విద్యార్థులకు పాఠశాల ప్రారంభం కాకముందే పదవ తరగతి తరగతులు నిర్వహిస్తున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నా వారికి సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు ఆక్స్ఫర్డ్ యాజమాన్యం పై చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసి గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.*




