‘దేనికైనా రెడీ’ సినిమాపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్ : మోహన్‌బాబు నిర్మించిన ‘దేనికైనా రెడీ’ సినిమాలోని రెండు అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. బ్రాహ్మణులను కించ పరిచేలా ఉన్న ఈ చిత్రాన్ని నిషేధించాలన్న పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. సినిమాలో మొత్తం కథాంశాన్ని చూడాలి తప్ప కొన్ని సన్నివేశాలు, దృశ్యాలను పరిగణనలోకి తీసుకోవద్దని కోర్టు పేర్కొంది. ఏవైనా అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను అశ్రయించాలి కానీ థియేటర్లపై దాడులు చేయడం తగదని పిటిషనర్‌ను న్యాయస్థానం మందలించింది. సినిమా అలరించే విధంగా ఉండాలని, ఎవరినీ కించపరిచేలా ఉందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్మాతకూ హైకోర్టు సూచించింది.




