హైదరాబాద్,(జనంసాక్షి): మంత్రి జానారెడ్డిపై మరోసారి హైకోర్టులో పిటిషణ్ దాఖలైంది. జానారెట్టి ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని వీవీ రావు అనే పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. కొన్ని మార్పులతో మళ్లీ జానారెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు సూచనతో ఈడీ, సీబీఐ. ఏసీబీలకు పిటిషన్ ఫిర్యాదు చేశారు.




