ఇంజక్షన్ వికటించి మేకపోతు మృతి:

జనం సాక్షి :(కొండమల్లేపల్లి) : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రానికి చెందిన సునముని రాములు తండ్రి ముత్తయ్య గారికి చెందిన మేకపోతు జ్వరంతో బాధపడుతుంటే కొండమల్లేపల్లి ప్రాథమిక పశువైద్య కేంద్రానికి తీసుకొని వచ్చారు కొండమల్లేపల్లి ప్రాథమిక పశు వైద్య కేంద్రం చెందిన డాక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో వెటర్నరీ అసిస్టెంట్ నిర్మల గారు మెడకు వరుసగా మూడు ఇంజక్షన్లు ఇచ్చారు ఇంజక్షన్ ఇవ్వగానే ఇంటికి తీసుకెళ్ళమన్నారు ఇంటికి తీసుకెళ్లిన అరగంటలోపే కింద పడిపోయి కాళ్లు కొట్టుకుంటుంటే మళ్ళీ ప్రాథమిక పశువైద్య కేంద్రం తీసుకొని వచ్చాము వచ్చిన ఐదు పది నిమిషాల లోపే మేకపోదు చనిపోయింది వెటర్నరీ అసిస్టెంట్ నిర్లక్ష్య వైఖరితోనే మేకపోతు చనిపోయిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు వెటర్నరీ అసిస్టెంట్ నిర్లక్ష్యానికి చనిపోయిన మేకపోతు కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు