రెబ్బెన, మే 26 (జనంసాక్షి) : బెల్లంపల్లి ఏరియాలోని సింగరేణి కార్మికుల విద్యార్థులు 2018-19 సంవత్సరానికి గాను జేఎన్‌టియూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంథిని మరియు యూనివర్సిటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెంలో బీటెక్ కోర్సులలో చేరుటకు విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏరియా డీజీఎం పర్సనల్ జె. కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జేఎన్‌టియూ మంథిని లో మైనింగ్ ఇంజనీరింగ్ 2 సీట్లు , సివిల్ ఇంజనీరింగ్ 3 సీట్లు, మెకానిక్ ఇంజనీరింగ్ 3సీట్లు , ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 3 సీట్లు , కంప్యూటర్ సైన్స్ 3 సీట్లు ఖాళీలు ఉండగా యూనివర్సిటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెంలో మైనింగ్ ఇంజనీరింగ్‌లో 2 సీట్లు ఖాళీలు ఉన్నట్లు ఆయన తెలిపారు. 2018 సంవత్సరంలో ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉన్న కార్మికుల మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అన్నారు. దరఖాస్తులు జూన్ 20లోగా జీఎంహెచ్‌ఆర్‌డికు పంపిచాలన్నారు. పూర్తి వివరాలకు పర్సనల్ డిపార్ట్‌మెంట్‌లో సంప్రదించాలన్నారు.




