Tuesday, 3 November 2026

ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీపై హైకోర్టులో పిల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీపై హైకోర్టులో ఇవాళ ప్రభుత్వం కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెలాఖరులో సీట్ల భర్తీపై స్పష్టత వస్తది అని ఉన్నతి విద్యామండలి చైర్మన్‌ జయప్రకాశ్‌రావు తెలిపారు. వీలైనంత త్వరగా ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. గత ఏడాది మెత్తం ఇంజినీరింగ్‌ సీట్లు 3 లక్షల 40 వేలు ఉండగా, ఈ సారి మరో పది వేలు సీట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ విభాగంలో 2 లక్షల 25 వేలు మంది విద్యార్థులు క్వాలిపై అయినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *