బాపట్ల , గుంటూరు : ఉగ్రవాదం తీవ్రవాదం కంటే అవినీతి, లంచగొండితనం దేశానికి తీవ్రమైన హాని చేస్తాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ ఎస్‌ఐటీలో బీటెక్ పూర్తిచేసిన తరువాత 1986-86లలో బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో తాను అధ్యాపకుడిగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శేషగిరి రావునుంచి తొలి జీతం అందుకుని కేకు కొని తన చెల్లెలికి పంపిన విషయాన్ని జీవితాంతం మర్చిపోలేనన్నారు. అనంతరం లక్ష్మీనారాయణను ముప్పలనేని శేషగిరిరావు సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ యార్లగడ్డ సురేంద్రబాబు, డీఎస్పీ భాస్కర్, సొసైటీ కార్యదర్శి మానం నాగేశ్వరరావు, సొసైటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు.




