ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ ఎంపీపీ ఈదురు రాజేశ్వరి

పెద్దవంగర ఆగస్టు 09(జనం సాక్షి )

స్వాతంత్రం వచ్చి75 సంవత్సరాలు పూర్తి ఐనా సందర్భంగా వజ్రోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కెసిఆర్ స్వీయ నాయకత్వంలో ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి సూచన మేరకు
మంగళవారం మండల కేంద్రం తో పాటు అన్ని గ్రామాలలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసి మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ వద్ద ఇంటి ఇంటికి స్వయంగా వెళ్లి స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్బంగా జాతీయ జెండాలను ఈదురు రాజేశ్వరి ఎంపీపీ పంపిణి చేయడం జరిగింది. తరువాత మాట్లాడుతూ అన్ని గ్రామాలలో స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు ప్రభుత్వం నిర్ణయించిన విదంగా ఘనంగా జరుపుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి . రమేష్ బాబు,ఎంపీడీఓ బి . వేణుగోపాల్ రెడ్డి,పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వి . రాంచంద్రయ్య శర్మ,స్థానిక ఎంపీటీసీ ఎదునూరి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శిలు ఏ . వెంకన్న,జగదీష్,గుగులోత్ రవి, టీ ఏ లు సురేష్,గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులు బోనగిరి లింగమూర్తి, అంగన్వాడీ టీచర్లు ఏడవెల్లి మంజుల రెడ్డి,ఎదునూరి రేణుక, మునుగోటి శ్రీలత,కారోబార్ కుమారస్వామి,అంగన్వాడీ ఆయాలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు