Friday, 6 November 2026

ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి రాయాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు23
ప్రతిరోజు ఇంటింటికి తిరిగి రోజువారి చెత్తను సేకరించాలని వినాయక నగర్ డివిజన్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి శానిటేషన్ సిబ్బంది కి సూచించారు. శనివారం మల్కాజిగిరి చౌరస్తాలోని గాంధీ పార్క్ లో శానిటేషన్ సిబ్బంది మరియు స్వచ్ఛ ఆటో కార్మికులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి సలహాలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.స్వచ్ఛ ఆటో కార్మికులు అధికారుల సూచనలు సలహాలు పాటిస్తూ ఇంటింటికి తిరిగి చెత్త సేకరించాలని తెలిపారు.ఒకరోజు చెత్త సేకరించ కపోతే ఆచెత్త రోడ్డుమీద పడుతుందని దీంతో ఈగలు దోమలు స్వైరవిహారం చేస్తూ ప్రజలకు విషజ్వరాలు వ్యాపించే అవకాశం ఉందని అన్నారు.అధికారుల సూచనల ప్రకారమే డబ్బులు వసూలు చేసుకోవాలని ఎక్కువ డిమాండ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.చెత్త సేకరించడం లేదని ప్రజల నుండి ఫిర్యాదులు అంతే ఆటో కార్మికుల పై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు.ఈకార్యక్రమంలో ఎన్విరాన్ స్పెషలిస్ట్ వీణ,శానిటేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు,మనోహర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.