Wednesday, 4 November 2026

ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు26
ప్రతిరోజు ఇంటింటికి తిరిగి రోజువారి చెత్తను సేకరించాలని నేరేడ్ మెట్ డివిజన్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి శానిటేషన్ సిబ్బందికి సూచించారు.శానిటేషన్ సిబ్బంది మరియు స్వచ్ఛ ఆటో కార్మికులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి సలహాలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.స్వచ్ఛ ఆటో కార్మికులు అధికారుల సూచనలు సలహాలు పాటిస్తూ ఇంటింటికి తిరిగి చెత్త సేకరించాలని తెలిపారు.ఒకరోజు చెత్త సేకరించ కపోతే ఆచెత్త రోడ్డుమీద పడుతుందని దీంతో ఈగలు దోమలు స్వైరవిహారం చేస్తూ ప్రజలకు విషజ్వరాలు వ్యాపించే అవకాశం ఉందని అన్నారు.అధికారుల సూచనల ప్రకారమే డబ్బులు వసూలు చేసుకోవాలని ఎక్కువ డిమాండ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.చెత్త సేకరించడం లేదని ప్రజల నుండి ఫిర్యాదులు అంతే ఆటో కార్మికుల పై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు.అనంతరం
స్వచ్ ఆటో మరియు టిప్పర్,రిక్షా కార్మిక సంఘం పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈకార్యక్రమంలో ఎన్విరాన్ మెంట్ స్పెషలిస్ట్ వీణ,ఉపేందర్ రెడ్డి, చెన్నారెడ్డి,శివ,నాగేందర్,
అంజనేయులు,రమేష్,అనిల్,పరమేష్, రామకృష్ణ పాల్గొన్నారు.