హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి రూ. 70 వేల నగదుతో పాటు ఐదు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ వ్యక్తి రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. శుక్రవారం తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్న నగదు బంగారు ఆభరణాలు కనపడకపోవడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.




