Tuesday, 3 November 2026

ఇంటి స్థలాల కోసం మూడో రోజుకు చేరిన జర్నలిస్టుల దీక్షలు * గుడిసెలు వేసి నిరసన * పలు జర్నలిస్టు సంఘాల మద్దతు

 

 

 

 

 

 

 

 

 

జనం సాక్షి /కొల్చారంప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ కొల్చారం మండలంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని మెదక్ జిల్లా టీఎన్జీయూ అధ్యక్షులు డి అశోక్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి కార్యవర్గ సభ్యులు అంబదాస్, రాములు అన్నారు. ఇంటి స్థలాల కోసం కొల్చారం మండల కేంద్రంలో నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్టులు చేపట్టిన నిరాహార దీక్షలు గురువారం మూడవ రోజుకు చేరుకున్నాయి. జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్టులు గురువారం గుడిసెలు వేశారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో లేకున్నా, దారిద్ర రేఖకు ఉన్నవారికి ఇంటి స్థలాల జీవొనే జర్నలిస్టులకు అమలు చేస్తున్నారు. దీంతో తామంతా బడుగు బలహీన వర్గాలకు చెందినవారమని, డబ్బులు వెచ్చించి అక్రిడేషన్ కార్డులు కొనలేని స్థితిలో ఉన్నామని తమకు ఇంటి స్థలాలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఇంటి స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా స్థానిక తహసిల్దార్, జిల్లా కలెక్టర్ జర్నలిస్టుల మధ్య గ్రూపులు చేసి ఎందుకు గొడవలకు కారణం అవుతున్నారన్నారు. జిల్లా మంత్రి హరీష్ రావు వెంటనే చొరవ తీసుకొని అందరు జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కొల్చారం మండలంలో వివిధ పత్రికలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో సుమారు 34 మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు. వీరిలో 21 మందికి అక్రిడేషన్ గుర్తింపు ఉంది. పోయినప్పటికీ ఇందులో 13 మంది ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. మిగిలిన ఏడుగురు అక్రిడేటెడ్ జర్నలిస్టులు 14 మంది నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్టులు కలిపి మరో గ్రూపుగా ఏర్పడ్డారు వీరంతా స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి ల దృష్టికి ఇళ్లస్థలాల సమస్యలను తీసుకెళ్లగా జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని స్థానిక తహసీల్దార్ తోపాటు జిల్లా కలెక్టర్ కు వారు సూచించారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి సూచనల మేరకు టీయూడబ్ల్యూజే మెదక్ జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి ప్రధాన కార్యదర్శి సంతోష్లు ఎమ్మెల్యే మదన్ రెడ్డి స్వగృహంలో కొల్చారం మండలం విలేకరుల తో సమావేశం ఏర్పాటు చేశారు మొదటి విడతలో అక్కడేషన్ ఉన్న 21 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంతోపాటు మిగిలిన వారికి కూడా ఇళ్లస్థలాలు ఇప్పించాలని తీర్మానించారు. ఈ తీర్మానం ప్రతిని ఎమ్మెల్యే మదన్ రెడ్డికి అందజేయగా కొల్చారం మండలంలో ని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్కు సిఫారసు చేశారు తీరా ఇళ్ల స్థలాలు కేటాయించే సమయంలో కేవలం మొదట గ్రూపుగా ఏర్పడిన 13 మంది జర్నలిస్టులకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు దీంతో అక్రిడేషన్ లేని 14 మంది జర్నలిస్టులు గత మూడు రోజులుగా జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో రిలే దీక్షలు చేస్తున్నారు. గురువారం రిలే దీక్షలలో భాగంగా జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో గుడిసెలు వేసి నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఈ నిరసన పలు జర్నలిస్టు సంఘాలు సైతం మద్దతు పలికాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం మెదక్ డి పి ఆర్ ఓ శాంతి కుమార్ కొల్చారం తహసిల్దార్ కార్యాలయం కి చేరుకుని దీక్ష చేస్తున్న జర్నలిస్టులతో మాట్లాడారు. ప్రత్యేకంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న జీవో లేదని దీక్ష చేస్తున్న తామంతా దళితులము, బడుగు బలహీన వర్గాల కు చెందిన వారమని తమలో కొంతమందికి ఇల్లు కూడా లేక పూరి గుడిసెలో నివాసం ఉంటున్నట్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తమకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని రాతపూర్వక హామీ ఇస్తే ఆందోళన విరమించనున్నట్లు తెలిపారు. దీంతో ఈ అంశం తమ పరిధిలో లేదంటూ అధికారులు చేతులెత్తేశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆదేశాల మేరకు పని చేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఒక గ్రూపు దీక్షలు చేస్తుండగా మరో గ్రూప్ దీక్షలో ఉన్న జర్నలిస్టులకు వారికి మద్దతు తెలుపుతున్న ఇతర జర్నలిస్టులకు నయానా భయానా తమ దారికి తెచ్చుకోనేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కొల్చారం మండలంలో జర్నలిస్టుల గ్రూపులు ఆసక్తికరంగా మారాయి.