హైదరాబాద్: ఉగ్రవాదులు మళ్లీ విధ్వంసానికి పాల్పడవచ్చని రాష్ట్రానికి కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. రద్దీ ప్రాంతాలు, స్థలాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చిని.. ఈరోజు, రేపు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భద్రతను పెంచి విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. రహదారులు, లాడ్జీలు, రద్దీ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను పోలీసులు కోరారు.




