ఇండియన్ ఇన్ఫోలైన్‌పై పోలీసుల దాడులు
మెదక్,(జనంసాక్షి): జహీరాబాద్‌లో ఇండియన్ ఇన్ఫోలైన్ కార్యాలయంపై ఈ ఉదయం పోలీసులు దాడులు నిర్వహించారు. బీమా పేరిట మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇండియన్ ఇన్ఫోలైన్ నిర్వహకుల్ని అదుపులోకి తీసుకున్నారు.