Wednesday, 4 November 2026

ఇందిరమ్మ కలలు వృథా కానివ్వరాదు: మండవ వెంకటేశ్వరరావు

సిరికొండ, జనంసాక్షి: ఇందిరమ్మ కలల పేరిట ప్రభుత్వం ఎస్‌సీ, ఎస్టీలను మోసం చేయచూస్తోందని, కలలు వృథా కానివ్వరాదని నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక అరికెల నర్సారెడ్డితో కలిసి సిరికొండ మండలం మైలారం గ్రామంలో జరిగిన ఇందిరమ్మ కలలు గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో ఎస్‌సీ కాలనీల్లో, గిరిజన తాండాల్లో ప్రతిపాదనలు తయారు చేస్తున్న అధికారులు వాటిని అమలయ్యేలా చూడాలని సూచించారు. ఒకవైపు ఉపప్రణాళిక ద్వారా ఎస్‌సీ, ఎస్టీలకు మేలు చేస్తామంటున్న ప్రభుత్వం ఉపాధి హామి నిధులను పక్కదారి పట్టించడం శోచనీయమన్నారు. ఇళ్లు, పింఛన్లు వంటి నిధులను కూడా ఉపప్రణాళిక నుంచి కేటాయించడం సమంజపం కాదన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్‌ రాజేశ్వర్‌, శ్రీనివాస్‌, ఏఈ జయంత్‌రావు, సొసైటీ ఛైర్మన్‌ గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *