హైదరాబాద్ (జనంసాక్షి ) : కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తెచ్చిన భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. వీహెచ్ దీక్షకు తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో కాంగ్రెస్‌పక్షనేత డి.శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరై మద్దతు తెలిపారు.




