Thursday, 5 November 2026

ఏసీబీ వలలో నాచేపల్లి వీఆర్వో

హైద‌రాబాద్  (జ‌నంసాక్షి ) కూసుమంచి: రైతు నుంచి లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నాచేపల్లి వీఆర్వో లక్ష్మణ్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. రైతు లక్ష్మణరావు తాను కొనుగోలు చేసి రిజిష్టర్‌ చేయించుకున్న 6 ఎకరాల వ్యవసాయ భూమికి పాసుపుస్తకం కోసం వీఆర్వోను సంప్రదించాడు. పాసుపుస్తకం కావాలంటే రూ. 20వేలు ఇవ్వాలని వీఆర్వో డిమాండు చేశాడు. రూ.15 వేలకు రైతు అంగీకారం కుదుర్చుకొని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా, సీఐ శ్రీనివాస్‌ సిబ్బందితో వచ్చి తహసీల్దారు కార్యాలయం సమీపంలో రైతు నుంచి నగదును తీసుకుంటున్న వీఆర్వోను పట్టుకున్నారు. ఈ మేరకు వీఆర్వో లక్ష్మణ్‌పై కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *