ఇక్కడ ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు..? ఇక్కడ ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు..? – పైప్ లైన్ కోసం తవ్వారు.. వదిలేశారు!
-వైఎస్ఆర్ సర్కిల్ వద్ద రహదారి ఇలా…
గద్వాల ప్రతినిధి నవంబర్ 25(జనంసాక్షి):- గద్వాల మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు అధ్వానంగా మారాయి. పట్టణంలో కొన్ని రోజులుగా పురపాలిక సిబ్బంది తాగునీటి పైప్లైన్ మరమత్తులకు రోడ్డును ఎక్కడికక్కడ తవేశారు. పని పూర్తయిన తర్వాత గుంతలను సరిగ్గా పూడ్చక పోగా, రాళ్లు కుప్పలను రోడ్లపైనే పేర్చి తమ పని అయిపోయిందని చేతులు దులిపేసుకున్నారు.మట్టిని అతిగా నింపకపోవడంతో అదుపుతప్పి గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నామో అని వాహనదారులు వాపోతున్నారు.నిత్యం రద్దీగా ఉండే ఆ దారిలో మరమ్మతు పనుల్లో జాప్యం వల్ల వాహనదార్లు ఇబ్బంది పడుతున్నారు. వాహన దార్లు గుంతలో పడి ప్రమాదాలకు గురవుతు న్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యా ర్థులు సైకిళ్లపై వెళుతూ కిందపడుతున్నారు. స్కూల్ బస్సులు, లారీలు కూడా ఆదారిలో వెళ్లలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని స్థానికులు సోషల్ మీడియా ద్వారా ఆర్ అండ్ బి అధికారులను మరియు మున్సిపాలిటీ అధికారులను కోరుతున్నారు
ఇక్కడ ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు.




