Wednesday, 4 November 2026

ఇక డైట్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్లోనే : శైలజానాథ్‌

హైదరాబాద్‌ : ఈ ఏడాది డైట్‌సెట్‌ కౌన్సెలింగ్‌ను అన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తామని మంత్రి శైలజానాథ్‌ చెప్పారు. డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులను పూర్తిగా డీఎడ్‌ అభ్యర్థులకే కేటాయిస్తుండటంతో గత రెండేళ్లుగా డైట్‌సెట్‌కు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగిందన్నారు. లక్షల మంది డైట్‌సెట్‌కు హాజరవుతున్నా కౌన్సెలింగ్‌ మాత్రం హైదరాబాద్‌లోనే జరగడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ ఏడాది డైట్‌సెట్‌ రికార్డు స్థాయిలో 5లక్షల 60వేల మంది హాజరయ్యారు. డైట్‌సెట్‌కు ఈ స్థాయిలో ఉన్న డిమాండ్‌ దృష్ట్యా ఇప్పటికే యాజమాన్య కోటా సీట్లను లక్షల్లో అమ్మకునేందుకే యాజమాన్య కోటా సీట్లను సైతం ఆన్‌లైన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *