ట్యాబ్‌ల ద్వారా వివరాల సేకరణ
హైదరాబాద్,మే8(జనం సాక్షి): ఇంటింట ఓటరు పరిశీలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక
చేసిన నియోజకవర్గాలల్లో ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు పక్కా ఓటర్ల జాబితా రూపకల్పనకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. తప్పులు లేని ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్‌ల సౌకర్యం, కొత్త ఓటరు నమోదుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో ఇంటింట ఓటర్ల పరిశీలన కార్యక్రమం అనుకున్నట్లు జరిగితే ఇక సమస్యలు ఉండవని భావిస్తున్నారు. ఓటు ఒక చోట ఉంటే పోలింగ్ కేంద్రం మరో చోట ఉండటం.. ఒకే ఇంటికి చెందినవారి ఓట్లు సైతం వివిధ పోలింగ్ బూత్‌ల పరిధిలోకి వెళ్లడం వంటి సమస్యలను పరిశీలించి సరిచేస్తారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో ఇకపై అలాంటి సమస్యలు ఉండొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తోంది. తాజాగా చేపట్టనున్న ఓట్ల ప్రక్షాళనను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఒక బూత్‌లెవల్ అధికారితో పాటు సహాయంగా ట్యాబ్ ఆపరేటర్, ప్లానింగ్ విభాగం నుంచి ఒకరిని నియమిస్తారు. గ్రావిూణ ప్రాంతాల్లో బీఎల్‌ఓ, ట్యాబ్ ఆపరేటర్ ఉండనున్నారు. ప్రత్యేక సాప్ట్‌వేర్ ద్వారా ట్యాబ్‌లలో ప్రతి ఇంటిలోని ఓటర్ల వివరాలన్నింటిని పొందుపరుస్తారు. ట్యాబ్‌తో పాటు ఓటరు జాబితాలను సైతం వారికి అందజేస్తారు. ఈ ట్యాబ్‌లు ఓటరు జాబితా వివరాలను తీసుకొని ఇంటింటికి వెళ్లి సంబంధిత ఓటర్ల వివరాలపై ఆరా తీస్తారు. ఇంట్లో ఎందరు ఓటర్లు ఉన్నారు..? వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రం సరైందేనా లేదా అనే వివరాలను ట్యాబ్‌లో అక్కడికక్కడే చూస్తారు. అందులో ఉన్నవారి వివరాలు,
ఓటర్ల జాబితాతో పొంతన లేకపోతే వెంటనే సరిచేయనున్నారు. పట్టణంతో పాటు గ్రామాల్లోనూ ఈ పక్రియను చేపట్టనున్నారు. మారుమూల గ్రామాల్లోనూ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.అలాగే ఇంటింట పరిశీలనలో ఓటరుగా నమోదు కాని వారిని ఓటరుగా నమోదు
చేయనున్నారు. అందుకు సంబంధించిన పక్రియను అక్కడికక్కడే పూర్తి చేయనున్నారు. జాబితాలోని తప్పొప్పులు పరిశీలించి తుది జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. వీటితో పాటు ఈ నియోజకవర్గంలో నూతనంగా పోలింగ్ బూత్‌ల మార్పులు, చేర్పులు సైతం చేపట్టనున్నారు.




