ఇచ్చిన మాట తప్పడం సరికాదు ..
– సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింప చేయాలి.
– 45వ రోజు నిరవదిక సమ్మెలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న ఊరుకొండ వీఆర్ఏ లు.
ఊరుకొండ, సెప్టెంబర్ 7 (జనం సాక్షి):
బహిరంగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట తప్పడం సరికాదు అని మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ బీ.సత్తయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఊరుకొండ మండల కేంద్రంలో వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 45వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా ఊరుకొండ మండల వీఆర్ఏలు డివిజన్ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను, వారి సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింప చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఊరుకొండ మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ బీ. సత్తయ్య, కో చైర్మన్ బీ.రమేష్ , జెర్నల్ సెక్రటరీ శేఖర్, కన్వినర్ బీ.శ్రీలత, కో కన్వినర్ లు సుల్తాన్. జంగయ్య, దశరథం. యాదయ్య, యాదమ్మ, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.