మృతురాలి కుటుంబానికి అండగా ఉంటాం..

– ఎంపీటీసీ కలిమిచెర్ల గోపాల్ గుప్తా.
ఊరుకొండ, సెప్టెంబర్ 7 (జనం సాక్షి):
నిరుపేద మృతురాలి కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎంపీటీసీ కలిమిచెర్ల గోపాల్ గుప్తా అన్నారు. బుధవారం ఊర్కోండ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త రాములు గారి తల్లి ఎల్లమ్మ(60) అనారోగ్యంతో మృతిచెందడం జరిగింది. స్థానిక నాయకుల ద్వారా ఈ విషాదకర వార్తను తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి గారు తన ప్రగాఢ సానుభుతి తెలియజేస్తూ రూ.5000/- మరియు నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి రూ.5000/-, ఎంపీటీసీ కలిమిచెర్ల గోపాల్ గుప్తా రూ.3000/- మరియు గ్రామ సర్పంచ్ శివరాణి హరీష్ రూ.2000/- మొత్తము రూ.15000/- ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ టీఆర్ఎస్ నాయకులు బండెల సుజీవన్ రెడ్డి, ఎం.వెంకటేష్, హరికిషన్, అనిల్, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.