Tuesday, 3 November 2026

ఇజ్రాయిల్‌ ప్రధానికి ఒబామా ఆహ్వానం

వాషింగ్టన్‌ : ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించేందుకు  ఆమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా.. ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఇజ్రాయిల్‌ ప్రధానికి ఆహ్వానం పంపినట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ప్రాంతీయ భద్రత, మధ్య ప్రాచ్య ప్రాంతంలో శాంతిస్థాపన అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరగనున్నట్లు అధికారులు వివరించారు. భద్రతా సమస్యలపై అమెరికా, ఇజ్రాయిల్‌ మధ్య సన్నిహిత సహకారం కొనసాగిండానికి అయా దేశాలు అంగీకరించినట్లు శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *