ఇజ్రాయిల్ స్టడీ టూర్ కు రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డ నర్సయ్య.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 3. (జనంసాక్షి). రాష్ట్ర వ్యవసాయ కోపరేటివ్ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పద్ధతుల అధ్యయనం చేసే స్టడీ టూర్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డ నర్సయ్య వెళ్ళనున్నారు. ఆగస్టు 5వ తేదీ నుండి 10వ,తేదీ వరకు బృందం సభ్యులు ఇజ్రాయిల్ దేశంలోని వ్యవసాయ ఆధునిక పద్ధతులను అధ్యయనం చేయనున్నట్లు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య తెలిపారు. స్టడీ టూర్ కు ఎంపిక అవడం కోసం సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి లకు గడ్డం నర్సయ్య కృతజ్ఞతలు తెలిపారు.

తాజావార్తలు