Tuesday, 3 November 2026

వ్యక్తిగత శుభ్రత తో ఆరోగ్యంగా ఉండవచ్చు.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు3
నులిపురుగుల నిర్మూలనకు వ్యక్తిగత శుభ్రత అవసరమని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్ అన్నారు.జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్ లిల్లీ మోడల్ హైస్కూల్ లో విద్యార్థులకు నులిపురుగులపై అవగాహన కల్పించి వాటి నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.విద్యార్థులు  మాత్రలు మింగడం వలన కడుపులో నులి పురుగులను నిర్ములించవచ్చని వ్యక్తిగత శుభ్రత తో ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో లిల్లీ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ షేక్ సయ్యద్ అహ్మద్, పాఠశాల ప్రిన్సిపల్,బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.