ఇట్టం సిద్ధరాములు ఇంట్లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
జనంసాక్షి రాజంపేట్
బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు సిద్ధిరాములు ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రక్షాబంధన్ సందర్భంగా తన సోదరి చేత రాఖీ కట్టించుకున్న సిద్ధిరాములు రాఖీ యొక్క విశిష్టత గురించి తెలిపారు.
రాఖీ అనేది కేవలం దారం కాదని , రాఖీ అనేది ఒక బలమైన బంధానికి ఆధారం అన్నారు.
సోదరిని దేవతల భావించి పూజించి పాదాభివందనం చేసి ఆమె ఆశీస్సులు పొందే గొప్ప పండగ మన రాఖీ పండుగ అన్నారు
సోదరి కోసం ఒక పండుగ జరుపుకొని , గౌరవించుకొనే గొప్ప సంస్కృతి మనదన్నారు.
ఈ సందర్బంగా ప్రతి అడపడుచుకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్ర మోహన్ డాక్టర్ స్వరూప రాణి డాక్టర్ రోజా కుటుంబ సభ్యులందరు పాల్గొన్నారు