Friday, 6 November 2026

ఇది కాంగ్రెస్‌ విజయం అన్న ఉత్తమ్‌

హైదరాబాద్‌,మే19( జ‌నం సాక్షి):  ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నాలు ఫలించాయని తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. యడ్యూరప్ప రాజీనామా కాంగ్రెస్‌ విజయమే అని పేర్కొన్నారు. కర్ణాటకలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందించారు. యడ్యూరప్ప రాజీనామా కాంగ్రెస్‌ విజయమే అని పేర్కొన్నారు. ఎట్టకేలకు ప్రజాస్వాయ్యం గెలిచిందన్నారు. 2019 ఎన్నికలకు ఇది పునాది అని ఉత్తమ్‌ పేర్కొన్నారు. బిజెపి అవినీతి రాజకీయాలకు చరమగీతం తప్పదన్నారు. 
—