ఇది రైతు దోపిడీ రాజ్యం

-భారీ వ‌ర్షాల‌కు ప‌త్తి పంట‌కి భారీ న‌ష్టం
– తెలంగాణలో 18.50 ల‌క్ష‌ల హెక్ట‌ర్ల‌లో న‌ష్టం.
-దేశ వ్యాప్తంగా 123 ల‌క్ష‌ల హెక్టార్లలో ప‌త్తి జ‌ల‌మ‌యం
– కేంద్ర,రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేక క‌మిటీలు వేయాలి
-ఒక్కో హెక్ట‌రుకు. రూ.50 వేల ప‌రిహార‌మందించాలి
-తెలంగాణ‌కు 12500 కోట్టు విడుద‌ల చేయాలి
-ఎఐఎఫ్‌బి రాష్ట్ర ఉపాధ్యాక్షుడు అంబ‌టి జోజిరెడ్డి

 

క‌రీంన‌గ‌ర్ టౌన్ ఆగస్ట్10 జనం సాక్షి.

రాష్ట్రంలో రైతు దోపిడీ రాజ్యం రాజ్య‌మేలుతోంద‌ని, భారీ వ‌ర్షాల‌కు, భారీ ఎత్తున న‌ష్ట‌పోయిన ప‌త్తి రైతాంగాన్ని ఆదుకోవాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆల్ ఇండియా ఫార్వ‌ర్డ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు అంబ‌టి జోజిరెడ్డి డిమాండ్ చేశారు. ప‌త్తి పంట న‌ష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వేర్వేరుగా ప్ర‌త్యేక క‌మిటీలు వేయాల‌ని, ఆయా క‌మిటీలు తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టించి పంట‌న‌ష్టంపై ఆరా తీయాల‌ని డిమాండ్ చేశారు.వ‌ర్షాల‌కు నీట మునిగిన ప‌త్తి పంట‌కు ఒక్కో హెక్టారుకు రూ.50 వేల చోప్పున న‌ష్ట ప‌రిహారం అందిచాల‌ని, వెంట‌నే తెలంగాణకు రూ.12500 కోట్లు విడుద‌ల చేయాల‌ని ఆయ‌న కేంద్రాన్ని డిమాండ్ చేశారు. క‌రీంన‌గ‌ర్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ దేశంలో 75 ఏళ్ల‌ల్లో ఎన్ని ప్ర‌భుత్వాలు, ఎన్ని పాల‌న‌లు చూపినా రైతు బ్ర‌తుకు మాత్రం మార‌లేద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం దేశంలో ఇందిర‌మ్మ రాజ్యం, రామ రాజ్యం, రాజన్న రాజ్యం, చూశామ‌న్నారు. ఇప్పుడు కెసిఆర్ తెలంగాణ రాజ్యం చూస్తున్నామ‌న్నారు. కేసీఆర్ రాజ్యంలో నీళ్లు అంటే కన్నీళ్లు, నిధులు అంటే గుప్తనిధులు, నియామకాలు అంటే కుటుంబ నియామకాలు అని విమర్శించారు. ఇలాంటి రాజ్యం మనకు వద్దన్నారు. ఇప్పటివరకు ఓట్లేసి గెలిపించిన నాయకులంతా కోట్లు సంపాదించారని,రైతుల‌కు మాత్రం ఏం చేయలేదన్నారు. రాష్ట్రంలోని రైతుల‌ను కేసీఆర్​, కేంద్ర స‌ర్కారు రెండూ కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. వ‌రుస‌గా కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎక‌రాల పంట భూములు నీట మునిగింద‌న్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే పంట పోలాలు జలమయం అయిన్నాయ‌న్నారు. రైతుల చేల‌కు వరద నీరు చేరిందన్నారు. తడిసిన పంట నీటి పాలైంద‌న్నారు. చేతికందిన పంట ఆంద‌కుండా పోయే స‌రికి రైతులు ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ ప్ర‌బుత్వాల చేయూత కోసం ఎదురు చూస్తున్నార‌ని పేర్కొన్నారు. భారీ వ‌ర్షాల‌కు ప‌త్తి పంట పూర్తిగా చేతికంద‌కుండా పోయింద‌ని వాపోయారు. ఆగ‌స్టు మొద‌టి వారంలో కురిచిన భారీ వ‌ర్షాల‌కు తెలుగు రాష్ట్రాల్లో 25ల‌క్ష‌ల హెక్టార్ల‌లో ప‌త్తి పంట నీళ్ల పాలైంద‌ని తెలిపారు. దేశవ్యాప్తంగా 123ల‌క్ష‌ల హెక్టార్ల‌లో ప‌త్తి పంటకు న‌ష్టం వాటిల్లింద‌ని తెలిపారు. ప‌త్తి పంట‌లో నీరు నిలిచి మొక్క‌ల ఎదుగ‌ల లేకుండా పోయింద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఒక్కో ఎక‌రాల‌కు ప‌త్తి రైతులు రూ.40 నుండి 50 వేల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ఇ ఉన్నార‌ని అన్నారు. వాన నీరు నిలియి ప‌త్తి మొక్క‌లు జాన‌డు ఎత్తు మాత్ర‌మే పెరిగి వాన‌నీటిలో ప‌త్తి పంట మురిగిపోయే ప‌రిస్థితిలో ఉన్నాయ‌ని అన్నారు. ఐదు, ఆరు సార్లు ప‌త్తి చేల‌లో క‌లుపులు తీసి రైతులు అప్పుల్లో మునిపోయార‌ని ఆయ‌న ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ఇటీవ‌ల ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ప‌లు ప్రాంతాల‌లో నీట మునిగిన ప‌త్తి పంట‌ల‌ను క్షేత్ర స్థాయిలో తాను ప‌రిశీలించిన‌ట్లు అంబ‌టి జోజిరెడ్డి తెలిపారు. జ‌న‌గామ జిల్లాలో ప‌ర్య‌టించినప్పుడు నీటిలో మునిగిన ప‌త్తి పంట‌ను చూసి అప్పుల పాలైన ఓ రైతు బాధ‌తో, ఆవేధ‌న‌తో ఆదోగ‌తికి పాల్ప‌డుతుంటే ఓదార్చి త‌న‌కు జ‌రిగిన న‌ష్టాన్ని ఆరా తీసిన‌ట్లు తెలిపారు. ఇది ఒక్క జ‌న‌గామ జిల్లాలో రైతులు ప‌డుతున్న క‌ష్టాలు కావ‌ని దేశ‌మంత‌టా ఉన్న ప్ర‌తీ ప‌త్తి రైతుల క‌ష్టాలు ఇలానే ఉన్నాయ‌న్నారు. ప‌త్తి రైతులు పెట్టుబ‌డి, పంట న‌ష్ట‌పోయి ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని పేర్కొన్నారు. ఆగ‌స్టు మొద‌టి వారంలో కురిచిన వ‌ర్షాల‌కు దేశ వ్యాప్తంగా 123 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో ప‌త్తి పంట‌కు న‌ష్టం వాటిల్లిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. తెలంగాణ‌లో 18.50 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో ప‌త్తి పంట న‌ష్ట‌పోయింద‌న్నారు. ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో 4.70 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో ప‌త్తి పంట నీట మునిగింద‌న్నారు. అలాగే పంజాబ్‌లో 2.50 ల‌క్ష‌ల హెక్టార్లు, హ‌ర్యానాలో 7.80 ల‌క్ష‌ల హెక్టార్లు, గుజ‌రాత్‌లో 25 ల‌క్ష‌ల హెక్టార్లు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 6 ల‌క్ష‌ల హెక్టార్లు, క‌ర్నాట‌క‌లో 7.50 ల‌క్ష‌ల హెక్టార్లు, త‌మిళ‌నాడులో 0.05 ల‌క్ష‌ల హెక్టార్లు, ఒడిషాలో 2-10 ల‌క్ష‌ల హెక్టార్లలో ప‌త్తి పంట నీట మునిగింద‌ని వివ‌రించారు. తెలంగాణ‌లో న‌ష్ట పోయిన ప‌త్తి రైతాంగాన్ని వెంట‌నే ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఎక‌రాకు రూ. 50 వేల చోప్ప‌న ప‌రిహ‌రం అందించి ప‌త్తి రైతులు ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. ల‌క్ష‌ల ఎక‌రాల‌లో ప‌త్తి పంట‌కు న‌ష్టం వాటిల్లితే ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు. తెలంగాణ వ్యాప్తంగా న‌ష్ట పోయిన ప‌త్తి పంట వివ‌రాల‌ను జిల్లాలు, మండ‌లాలు, గ్రామాల వారిగా ఆరా తీసి, స‌మ‌గ్ర స‌మాచారాన్ని కేంద్ర ప్ర‌భుత్వానికి రిఫోర్టు చేయాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. ఎప్ప‌టికీ స్వార్థ రాజ‌కీయాలపై దృష్టి త‌ప్ప సీఎం కెసిఆర్‌కు రైతుల‌ను ఆదుకోవాల‌నే ఆలోచ‌నే లేద‌న్నారు. ఒక్కో హోక్ట‌రుకు రూ. 50వేల న‌ష్ట ప‌రిహారం చోప్పున దేశ వ్యాప్తంగా న‌ష్ట పోయిన 25 ల‌క్ష‌ల హెక్టార్ల‌కు వెంట‌నే 12500 కోట్టు విడుద‌ల చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని అంబ‌టి జోజిరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే దేశ వ్యాప్తంగా న‌ష్టం వాటిల్లిన 123 ల‌క్ష‌ల హెక్టార్ల ప‌త్తి రైతుల‌కు ఒక్కో హెక్ట‌రుకు రూ.50 వేల న‌ష్ట ప‌రిహారాన్నిఅందించి ఆదుకోవాల‌ని ఆయ‌న కేంద్ర ప‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ స‌మావేశంలో ఎఐఎఫ్‌బి జిల్లా నాయ‌కులు మారుపాటి సంతోష్, పెద్దెళ్లి శేఖ‌ర్ త‌దిత‌రులు పాల్టొన్నారు.