Wednesday, 4 November 2026

ఇనార్బిట్ మాల్లో డాన్యూబ్ హోమ్ షోరూమ్ ప్రారంభం

ఖైరతాబాద్ : ఆగస్ట్ 15 (జనం సాక్షి) డాన్యూబ్ హోమ్, అన్ని ఇంటి ఇంటీరియర్, మెరుగుదల అవసరాల కోసం ప్రముఖ వన్-స్టాప్ రిటైల్ సొల్యూషన్ హైదరాబాద్ లోని ఇనార్బిట్ మాల్లో ఆగస్ట్ 12 న తన సరికొత్త షోరూము ప్రారంభించింది. ఈ షోరూమ్ భారతీయ బ్యాడ్మింటన్ సంచలనం మరియు చీఫ్ నేషనల్ కోచ్ ప్రారంభించారు. భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టు పుల్లెల గోపీచంద్ తో పాటు డాన్యూబ్ హోమ్ టాప్ మేనేజ్మెంట్ చాలా వైభవంగా జరిగింది. బ్ హోమ్ యూఏఈ అంతటా అనేక షోరూమ్లను కలిగి ఉంది. 17 దేశాలలో 26 కంటే ఎక్కువ శాఖలను కలిగి ఉంది. ఈ సందర్భంగా డాన్యూబ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అడెల్ సజన్ మాట్లాడుతూ తాము అందించే ఉత్పత్తులు, సేవల శ్రేణి లేదా మా ఆదర్శప్రాయమైన కస్టమర్ సేవ విషయానికి వస్తే ఎల్లప్పుడూ కస్టమర్ సెంట్రిక్ విధానాన్ని అనుసరిస్తామన్నారు. తమ కస్టమర్లు ఎక్కడ ఉన్నారో చేరుకోవడానికి మా వంతుగా నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు. తమ అన్ని విస్తరణ ప్రణాళికలలో మేము వ్యూహాత్మక విధానాన్ని ఉపయోగిస్తామన్నారు. ఇనార్బిట్ మాల్లోని కొత్త షోరూమ్ తమకు మరింత చేరువయ్యేలా చేస్తుందన్నారు.