Wednesday, 4 November 2026

వికారాబాద్ సీఎం సభలో ఆకర్షణగా వెలసిన మోమిన్ పేట మండల టిఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలు

మోమిన్ పేట ఆగస్టు 15( జనం సాక్షి)
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆగస్టు 16న ముఖ్యమంత్రి పర్యటనలో ఆకర్షణంగా వెలసిన మోమిన్ పేట మండల టిఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి మోమిన్ పేట మండలానికి చెందిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయకుమార్ మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ శ్రీకాంత్ గౌడ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు ఎన్ నర్సింహారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు డబ్బాని వెంకట్ ఎంపీపీ వసంత వెంకట్ లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్న కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ప్రధాన రహదారుల వద్ద టిఆర్ఎస్ నాయకుల ప్లెక్సీలు స్వాగత తోరణాలు ప్రజలకు ఆకర్షణగా వెలిశాయి పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఫ్లెక్సీలను పోటీపడి చూస్తున్నారు దీనికి తోడు వికారాబాద్ పట్టణంలో అధిక శాతం ప్లెక్సీలు మోమిన్ పేట నాయకులవే కనిపిస్తున్నాయి నియోజకవర్గ రాజకీయాలు మోమిన్ పేట మండల వాసుల చేతుల్లోని కనిపిస్తున్నాయి