ఇనుగుర్తిలో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ…

సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో

 

కేసముద్రం ఆగస్టు 9 జనం సాక్షి / 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని మండలంలోని ఇనుగుర్తి గ్రామం లో సర్పంచ్ దార్ల రాంమూర్తి,పంచాయతీ సిబ్బంది,వివో ఏలు ఇంటింటికి తిరుగుతూ జాతీయ జెండాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దార్ల రామ్మూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైన జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని తెలియజేశారు.