Wednesday, 4 November 2026

ఇనుగుర్తి లో జాతీయ జెండాలతో ఘనంగా ర్యాలీ..

కేసముద్రం ఆగస్టు 13 జనం సాక్షి  / స్వతంత్ర భారత ద్విసప్తాహం లో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ దార్ల రామ్మూర్తి, పంచాయతీ కార్యదర్శి ఆలేటి శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ ని గ్రామపంచాయతీ దగ్గర నుండి బస్టాండ్ సెంటర్ వరకు ప్లకార్డు లను ప్రదర్శిస్తూ,మువ్వన్నెల జెండాను రెప రెప లాడిస్తూ ,మూడు రంగుల బెలూన్ ల ను గాలిలో ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో టీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ ప్రిన్సిపాల్ విజయలలిత,పి ఈ టి రాజేందర్ సమక్షంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులతో పాటు ఎంపీటీసీ పింగిలి శ్రీనివాస్,ఉపాధ్యాయులు ధనలక్ష్మి,మాధవి,శ్రీలక్ష్మి,స్వప్న, పీఈటీలు, వార్డుమెంబెర్ గుజ్జునూరి వెంకన్న,ఉమ్మగాని మధు,నాగరాజు,అంగన్ వాడి టీచర్లు, ఏఎన్ఎం పొన్నం కవిత ,ఆశ వర్కర్ లు,సి ఏ లు, అశోక్ ,సులోచన,పావని మరియు గ్రామస్థులు పాల్గొని విజయవంతం చేశారు.