Wednesday, 4 November 2026

వజ్రోత్సవ ర్యాలీకి హాజరైన : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

ఎల్బీనగర్( జనం సాక్షి )   భారతదేశంనకు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా నిర్వహిస్తున్న  వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం  నాగోలు డివిజన్  జైపురి కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 75 అడుగుల  జాతీయ జెండాను  విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాల భాగస్వామ్యంతో నిర్వహించిన  వజ్రోత్సవ ర్యాలీకి ముఖ్యఅతిదులుగా విచ్చేసిన  ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి  ముద్దగౌని రామ్మోహన్ గౌడ్   తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ తెరాస పార్టీ  అద్యక్షులు తూర్పాటి  చిరంజీవి , జైపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్యామల యాదగిరి , తెరాస పార్టీ  నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ రాహుల్ పోతాని , ఉపాధ్యక్షులు శంకర్, శ్రీనివాస్ , ఆర్గనైజింగ్ సెక్రటరీ జంగాల శివకుమార్ యాదవ్ , జాయింట్ సెక్రెటరీ కస్తూరి అశోక్ , కె ఆదిలాల్ ,  ట్రెజరర్ నల్ల నాగరాజు , గౌరవ అధ్యక్షులు ఎస్ ఆర్ గంగాధర్ , కౌన్సిల్ సభ్యులు నాగభూషిని, మమత, పద్మ , రవికుమార్, ప్రవీణ్ యాదవ్  మరియు సెయింట్ జాన్ స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు ఉపాధ్యాయులు జైపురి కాలనీవాసులు , నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగినది..